1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:31 IST)

నా భర్త 'విశాల్' కాదు.. హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ

తమిళ చిత్ర రంగంలో యువ హీరో విశాల్. తెలుగువాడైనప్పటికీ.. తమిళ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే, ఈయన ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లోకెక్కుతున్నాడు. దీనికి కారణం.. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధి

తమిళ చిత్ర రంగంలో యువ హీరో విశాల్. తెలుగువాడైనప్పటికీ.. తమిళ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే, ఈయన ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లోకెక్కుతున్నాడు. దీనికి కారణం.. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమేకాకుండా, పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. 
 
అదేసమయంలో వివాదాస్పదుడిగా తయారయ్యాడు. రోజుకో కామెంట్‌తో విశాల్ వార్తల్లో నిలుస్తున్నాడు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ ప్రేమ వ్యవహారంపై శరత్ కుమార్ మాత్రం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నడిగర్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశఆల్ ప్రకటించడంతో అందరూ ఈ జంట త్వరలో ఒక్కటవబోతోందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చిన వరలక్ష్మీ.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు మొత్తం అబద్ధాలని, తాను ఎవరి ప్రేమలో పడలేదని స్పష్టం చేసింది.