గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (09:48 IST)

హెబ్బా పటేల్‌కు అవకాశాల వెల్లువ... పెళ్లిచూపులు విజయ్ దేవరకొండతో రొమాన్స్?

హీరోయిన్ హెబ్బా పటేల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హెబ్బా పటేల్‌కు చేతినిండా సినిమా ఛాన్సులున్నాయి. ఇప్పటికే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్

హీరోయిన్ హెబ్బా పటేల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హెబ్బా పటేల్‌కు చేతినిండా సినిమా ఛాన్సులున్నాయి. ఇప్పటికే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ అనే సినిమాల్లో నటించిన హెబ్బా పటేల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా కుమారి ఖాతాలోకి చేరిపోయింది. పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
 
ఇందులో ప్రధాన హీరోయిన్ పాత్రకు హెబ్బా పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కథతో పాటు తన పాత్ర నచ్చడంతో హెబ్బా పటేల్ కూడా రాహుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ పండితులు చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో హెబ్బాపటేల్ ఓ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.