ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 11 జులై 2016 (14:47 IST)

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్‌గా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుకున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా రికార్డు బద్దలు క

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్‌గా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుకున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా రికార్డు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 
 
ప్రస్తుతం 2001లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'నాయక్' (తెలుగులో 'ఒకేఒక్కడు') సీక్వెల్‌కు కథను సిద్ధం చేసే ప్రసాద్ నిమగ్నమైయున్నారు. ఇది కాకుండా ఓ హిందీ సినిమాకి కథ అందించనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కథ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. 
 
ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారే టాక్ వినిపిస్తోంది. "కబీర్'' టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నాడట. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లాని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమా కూడా బాలీవుడ్ లో ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే మరి.