శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (15:11 IST)

ధనుష్‌కు నాకు పెళ్ళైపోయింది.. ఆ అనుభూతి వైరైటీ: అమలాపాల్

వీఐపీ-2లో పెళ్ళైన అమ్మాయిగా నటించడం వ్యత్యాసమైన అనుభూతినిచ్చిందని.. ఆ సినిమా హీరోయిన్ అమలాపాల్ చెప్తోంది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ నటించిన సినిమా వీఐపీ-2. 2014వ సంవత్సరం రిలీజైన వ

వీఐపీ-2లో పెళ్ళైన అమ్మాయిగా నటించడం వ్యత్యాసమైన అనుభూతినిచ్చిందని.. ఆ సినిమా హీరోయిన్ అమలాపాల్ చెప్తోంది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ నటించిన సినిమా వీఐపీ-2. 2014వ సంవత్సరం రిలీజైన వేలైఇల్లా పట్టదారి సినిమాకు సీక్వెల్‌గా వీఐపీ2 తెరకెక్కింది. తొలి భాగంలో ధనుష్‌కు ప్రేయసిగా నటించిన అమలాపాల్.. రెండో భాగంలో ధనుష్‌కు భార్యగా నటించింది.
 
ఈ సినిమాపై అమలా పాల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడతాయని చెప్పింది. కారణం.. వీఐపీ-2లో ధనుష్‌కు తనకు వివాహమైపోయింది. వివాహమైన అమ్మాయిగా ఈ చిత్రంలో నటించడం.. వ్యత్యాసమైన అనుభూతినిచ్చింది. సౌందర్య రజనీకాంత్‌తో పాటు టీమ్ మొత్తం వీఐపీ-2 రిలీజ్ కోసం ఎదురుచూస్తుందని చెప్పింది. తొలి భాగం కంటే రెండో భాగంలో తాను స్టైల్‌గా కనిపించనున్నట్లు అమలాపాల్ వెల్లడించింది.