బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (09:20 IST)

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

Kiran, nagavamsi
Kiran, nagavamsi
సినిమాలు విడుదలకుముందు ఇందులో కంటెంట్ చాలా కొత్తది. ఇంతకుముందు ఎక్కడా రాలేదు. అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక విడుదలయ్యాక ఇది ఫలానా సినిమా ఫలానా సీన్ కాపీ చేశారంటూ రివ్యూవర్స్ రాస్తూంటారు. ఇవన్నీ తెలిసినా తమ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఏదో కొత్త విషయం వుందని భ్రమింపచేయాలి. అలా ప్రతీ సినిమాకూ హీరో, నిర్మాత, దర్శకుడూ చెబుతూనే వుంటారు.
 
తాజాగా దీపావళి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సినిమా లక్కీ భాస్కర్ విడుదలైంది. నాగవంశీ నిర్మాత. అదేవిధంగా తెలుగు హీరో కిరణ్ అబ్బవరం సినిమా క విడుదలైంది. ఈ సినిమా విడుదలకుముందునుంచే ప్రీరిలీజ్ లో కిరణ్ భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. క సినిమాలోని పతాకసన్నివేశంలోకానీ ఇతర చోట్ల కానీ ఇంతకుముందు సినిమాలు వచ్చాయని మీరు నిరూపిస్తే నేను ఇక సినిమాలు చేయనని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ విషయంలో తాను చాలాక్లారిటీ వున్నానని ధైర్యంగా చెప్పాడు. ఇక సినిమా విడుదలయ్యాక క సినిమా తరహా ఏ సినిమాతో పోల్చలేమని ఇది సరికొత్త ఒరవడి అంటూ ప్రేక్షకులు రివ్యూర్స్ తీర్పు చెప్పారు. 
 
అందుకే దీవాళి విన్నర్ "క" సినిమా సక్సెస్ పై ఎమోషనల్ పోస్ట్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. '*ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు. "క" సినిమా సక్సెస్ కంటే మీరు నాపై  చూపిస్తున్న ఈ ప్రేమ మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని. మీ అందరికీ  కృతజ్ఞతలు..*' అంటూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
 
కిరణ్ అబ్బవరం పోస్ట్ కు ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా స్పందిస్తున్నారు. అన్నా మీరు ఇలాంటి సక్సెస్ కు అర్హులు అని, హిట్ కొట్టేశాము అన్నా అని, లవ్ యూ అన్నా అంటూ రిప్లైస్ వస్తున్నాయి. అలాగే పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా కిరణ్ అబ్బవరంకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. "క" సినిమా డిఫరెంట్ పీరియాడిక్  థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది అన్నారు.
 
ఇక లక్కీ భాస్కర్ నిర్మాత కూడా తెలుగులో బ్యాంకింగ్ వ్యవస్థలో షేర్ మార్కెట్ ను మిక్స్ చేస్తూ తీసిన సినిమా గతంలో ఏ సినిమాతోనూ సరిపోదని, సరికొత్తగా తీశామని చెప్పాడు. సినిమా చూశాక తను చెప్పించే నిజమేనంటూ రివ్యూరర్స్ కూడా వెల్లడించడంతో తను చేసిన ఛాలెంజ్ ను సక్సెస్ అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక దర్శకుడు వెంకీ అట్టూరితో మరో సినిమా చేయడానికి ఆయన సిద్ధమయ్యాడు. త్వరలో వివరాలు తెలియనున్నాయి.