సామి-2లో విక్రమ్ సరసన కీర్తి సురేష్.. త్రిష పాత్ర అరగంటేనా?

14 ఏళ్ల క్రితం విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "సామి". ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకున్నారు. కానీ త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో పాట

బుధవారం, 3 మే 2017 (17:11 IST)
14 ఏళ్ల క్రితం విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "సామి". ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకున్నారు. కానీ త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో పాటుగా మోహిని, గర్జనై, 1818, శతురంగ వేట్టై-2, హేయ్ జూడ్, 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో దక్షిణాది హీరోయిన్ అయిన త్రిష చేతినిండా భారీ ఆఫర్లను దక్కించుకోవడంతో ఖుషీ ఖుషీగా ఉంది. 
 
అయితే త్రిషకు సామి-2 సినిమాలో రోల్ పరిమితమేనని తేలింది. ‘నేను శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేశ్‌ సామి-2కి హీరోయిన్‌గా ఎంపికైంది. ‘సింగం’ సిరీస్‌ చిత్రాల దర్శకుడు హరి.. చియాన్‌ విక్రమ్‌తో కలిసి ‘సామి 2’ తెరకెక్కించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘సామి’కి ఇది సీక్వెల్‌. ఇందులో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 
 
తొలి భాగంలో నటించిన త్రిష ఈ భాగంలోనూ కొనసాగుతుంది. కానీ త్రిష పాత్రకు రెండో భాగంలో అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చునని సమాచారం. అరగంట మాత్రమే త్రిష కనిపిస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

అన్నీ చూడండి

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

అన్నీ చూడండి

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments