1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (14:37 IST)

ఎవరేమనుకున్నా నా పొగరు తగ్గదు : నిత్యామీనన్

తన గురించి ఎవరేమనుకున్నా... నా తల పొగరు ఏమాత్రం తగ్గదని మలయాళ బ్యూటీ నిత్యామీనన్ స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ నిర్మిస్తున్న సావిత్రి చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్ ఎంపికైన విషయం తెల్

తన గురించి ఎవరేమనుకున్నా... నా తల పొగరు ఏమాత్రం తగ్గదని మలయాళ బ్యూటీ నిత్యామీనన్ స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ నిర్మిస్తున్న సావిత్రి చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్ ఎంపికైన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో తలతిక్క వేషాలు వేస్తుండటంతో అమ్మడుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా, హీరో దుల్కర్ సల్మాన్‌‌తో ప్రేమాయణం నడుపుతోందనీ, నిత్య కారణంగా ఆ హీరో కాపురంలో చిచ్చు రగిలిందనీ, ఆ హీరోగారింట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయనీ తమిళ తంబీలు అంటున్నారు. వీటిపై ఆమె ఘాటుగానే స్పందించారు. 
 
నా విషయంలో ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. ఎవరినీ లెక్క చేయవలసిన అవసరం నాకు లేదు అని స్పష్టం చేసింది. అంతే తప్ప సల్మాన్‌ దుల్కర్‌తో ప్రేమ వ్యవహారం నడపడం లేదని మాత్రం చెప్పకపోవడంతో ఈ ఎఫైర్‌ వార్తలు నిజమే అంటున్నారు.