1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

తెలంగాణాపై మాట్లాడమంటారా...?: సమీరా రెడ్డి

ముంబయిలో సెటిలైన సమీరా రెడ్డి ఆనక హీరోయిన్‌గా మారి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సాధించుకున్నది. తాజాగా బుద్ధదేవ్ దాస్‌గుప్తా "కల్‌పురుష్" చిత్రంలో ఆమె నక్సలైట్ పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని నక్సలైట్‌గా దర్శకుడు ఆమె పాత్రను చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో సమీరాను తెలంగాణా అంశంపై మాట్లాడమని అడిగితే... ఒక్కసారి అదిరిపడింది. 

తనకు రాజకీయాల గురించి పరిజ్ఞానం లేదనీ, ఏది మాట్లాడినా దానికి ఏవేవో అర్థాలు తీస్తారని చెప్పింది. మరి ఆంధ్రలోని నక్సలైట్ పాత్ర చేస్తున్నారు కదా... దాని గురించైనా చెపుతారా...? అని ప్రశ్నిస్తే, అది కూడా దర్శకుడు ఏం చెపితే దానినే చేస్తున్నాననీ అంతకు మించి తనకు ఏమీ తెలియదనీ, మరిన్ని వివరాలు కావాలంటే దర్శకుడినే అడగమని చెప్పింది.

ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాను ఎట్టి పరిస్థితిల్లోనూ వ్యాఖ్యానించనని ఒట్టు వేసి మరీ చెప్పింది సమీరా. అవును మరి... మహామహా నాయకులే తెలంగాణా అంశంపై మౌనముద్ర దాలుస్తుంటే సమీరా మాత్రం ఏం మాట్లాడుతుందీ...