గత కొన్ని రోజులుగా తన వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అందాల నటి ఛార్మి తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడితో తనకు నిశ్చితార్థం జరిగిందనీ, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయని మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయానని ఛార్మి చెప్పింది.