Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేనిప్పటివరకూ ముసలాళ్లను కౌగలించుకోలేదు: ప్రియాంక
ప్రియాంకా చోప్రా... బాలీవుడ్ బ్యూటీ డాల్స్‌లో ఒకరు. అందమైన శరీరాన్ని కలిగి ఉండటం తనకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకునే ప్రియాంక, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతమేరకు కావాలో అంతమేరకు తన శరీరాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని చెపుతోంది. అయితే అది తను నిర్ణయించుకున్న సరిహద్దులు దాటి ఉండదని చెపుతోంది.
సినిమాల్లో కౌగిలింతలకు నిజజీవితంలో కౌగలింతలకు తేడాలున్నాయని అకస్మాత్తుగా రొమాంటిక్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. మనసునిండా ప్రేమ నిండినపుడే నిజజీవితంలో ఒక వ్యక్తిని కౌగలించుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. నటనలో ప్రేమతో కూడిన కౌగిలింతలుండవనీ అంది.
తనకు యుక్త వయస్సు వచ్చినప్పట్నుంచి వృద్ధులను కౌగలించుకున్నట్లు గుర్తు లేదని ముక్తాయింపు ఇచ్చింది. అంటే కుర్రవాళ్లను కౌగలించుకున్నాననా దీనర్థం...?