1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

ప్చ్... కిస్ ఇవ్వలేక పోయాను: అమృతా రావు

మహేష్ బాబు సరసన "అతిథి"లో నటించిన అమృతారావు హీరోయిన్లు చేయగల ఏ సీనుకైనా తను సిద్ధమేనని అంటోంది. ఇలా బహిరంగంగా చెప్పినప్పటికీ... బేబీకి చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్‌ చిత్రం మాత్రమే ఉంది. 

ఇన్నాళ్లు హోమ్లీ హీరోయిన్ అనుకుని కిస్ సీన్స్ చేయలేక పోయానని వెంటనే నాలుక కరచుకుంది. అయితే కళాత్మక చిత్రాల పేరిట న్యూడ్ దృశ్యాలు చూపిస్తున్నారనే మాటకు స్పందిస్తూ.... అది కూడా కళేనని చెప్పింది. అసలు అందులో తప్పేమీ లేదని ఎదిరిస్తోంది.

అంతర్జాతీయ టీవీ ఛానల్స్‌లో ఇటువంటివాటిని చూస్తున్న ప్రేక్షకులు అటువంటి సన్నివేశాలను చూస్తూ అలవాటుపడ్డారని కూడా ధైర్యంగా చెపుతోంది. అవార్డుకోసం తీసే కళాత్మక చిత్రాల్లో నాచురల్‌గా చూపిస్తే తప్పులేదని అంటోంది. దాంతోపాటు... అంతగా అసభ్యంగా ఉంటే సెన్సార్ ఉందిగా వారు చూసుకుంటారని చెబుతోంది.

అంటే... తను కళకోసం దేనికైనా రెడీ అని చెప్పకనే చెబుతోందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగులో ప్రముఖ హీరో సరసన నటించనున్నదని వార్తలు వచ్చాయి. ఆ వివరాలు త్వరలో చెపుతానంటోంది.