శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Harsha Vardhan

ప్రభాస్ "బిల్లా"లో నమిత..!?

తన అందచందాలతో యువకుల మనస్సుల్లో గిలిగింతలు పెడుతున్న సెక్సీ క్వీన్ "నమిత". టాలీవుడ్‌లో "సంతోషం", "జెమిని", "ఒక రాజ ఒక రాణి" వంటి చిత్రాలతో తన కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ఈ భామ తాజాగా కోలీవుడ్‌లో తన హవాను కొనసాగిస్తుంది.

ఈ నేపథ్యంలో... కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ సరసన "బిల్లా"లో అందాలను ఒలకపోసిన నమిత... అదే తెలుగు రీమేక్ "బిల్లా"లో ప్రభాస్ సరసన నటించనుందని వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు "బిల్లా"లో ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా నమిత రెండో కథానాయిక పాత్రలో ప్రేక్షకులను అలరించనుందని సమాచారం.

తమిళ "బిల్లా"లో స్లిమ్ గర్ల్‌గా శరీరాకృతులను తగ్గించుకుని అజిత్‌కు తగ్గ జోడీగా కన్పించిన నమిత, తెలుగు "బిల్లా" హీరో ప్రభాస్ సరసన ఇంకా ఆకర్షణీయంగా కన్పించేందుకుగానూ... బరువు తగ్గించే ప్రయత్నాలు చేస్తోందట. ఇంకేముంది... అనుష్క అందాల ఆరబోతకు "నమిత" సెక్సీ అందాలు జోడైతే కుర్రకారుకు పండగేపండుగ.!!!