రాఖీతో నాకు పోలికా..! హ.. హ్హ... హ్హ్హ..!!: షెర్లిన్
ముప్పావు వంతు శరీరాన్ని ప్రదర్శించే షెర్లిన్, తన అందాలతో సెక్సిణి రాఖీ సావంత్ అందాలను పోల్చి మాట్లాడటాన్ని హాస్యాస్పదమైన అంశంగా కొట్టి పారేసింది. ఇటీవల కొంతమంది ఫిలిమ్ జనం రాఖీ- షెర్లిన్లిద్దరూ తమతమ అందాలను ప్రదర్శించడంలో పోటాపోటీగా ఉంటారనీ, ఇద్దరికీ సమస్థాయిలో అందాలున్నాయని కితాబిచ్చారు. దీనిపై షెర్లిన్ మండిపడింది. తన అందంముందు రాఖీ అందం ఏ మూలకీ సరిపోదనీ ఎద్దేవా చేసింది.
ఇదిలావుండగా ఎవరు అందం గొప్ప అనే విషయంలో ఇదివరకే రాఖీ- షెర్లిన్లిద్దరూ "ఢీ" కొట్టుకున్నారట. పిల్లుల్లాగా పోట్లాడుకున్నారట. అందాల విషయంలో ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు చెప్పలేనంత ఘాటు పదాలతో ఉన్నాయట. తాజాగా మరోసారి వీరిరువురి మధ్య "అందాల" తగాదాను పురిగొల్పిన సదరు ఫిలిమ్ జనం షెర్లిన్- రాఖీ పరుష పదజాలాన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారట. మరి షెర్లిన్- రాఖీలకు ఈ సంగతి తెలిస్తే ఏం చేస్తారో...!!