మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

రామ్ చరణ్‌ నాతో బంతాట ఆడుతున్నాడు: పద్మాసీ

టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన "మగధీరుడు" రామ చరణ్ తేజపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది బాలీవుడ్ "రాకెట్ సింగ్" పద్మాసీ. రామ్ చరణ్ సహనటులను ప్రోత్సహించడంలో ముందుంటారని తన అందమైన పెదవులను సాగదీస్తూ చెప్పింది. అంతేకాదు ఒక్కసారి "మగధీర"తో చేసినవారు మళ్లీ మళ్లీ నటించాలని ఉవ్విళ్లూరుతారని కళ్లు చికిలిస్తూ వగలు పోతోంది. 

అదిసరే... రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు కదా... ప్రస్తుతం ఆయనతో చేసిన ఓ షూటింగ్ ముచ్చట చెప్పమని అడిగితే, "బంతాట ఆడుకుంటున్నాం" అని టక్కున చెప్పేసింది.

అర్థం కాలేదు.. మరోసారి చెప్తావా? అని ప్రశ్నిస్తే... "అదేనండీ రామ్ చరణ్ నాతో బంతాట ఆడే సన్నివేశాన్ని ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి ఎంచక్కా బాల్ ఆట ఆడుకున్నాం. అలా ఆడినంత సేపు ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తోంది" అని సంతోషాన్ని వ్యక్తపరిచింది.

రామ్ చరణ్‌కు గుఱ్ఱపు స్వారీయే కాదు... బంతులాట కూడా బాగా వచ్చన్నమాట!!