మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

హీరోయిన్లు దర్శకులకు సహకరించాలి: ప్రియమణి

ఇటీవల బికినీలతో కుర్రకారుకి కిక్కెక్కించిన సెక్సిణి ప్రియమణి తను బికినీల్లో కనిపించడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ఈత కొట్టేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన బికినీలో కనబడితే తప్పులేదనీ, ఈత కొట్టేవాళ్లందరూ బికినీలు వేసుకున్నప్పుడు సినిమాలో అటువంటి సన్నివేశాల్లో నటించేటపుడు తను బికినీ వేసుకోవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నలు వేస్తోంది.

ఒక సినిమా కథను అనుకున్నప్పుడు దర్శకుడికి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన కోణాలు ఉంటాయనీ, పాత్రలను ఎలా చూపెడితే రక్తి కడుతుందన్న దాన్నిబట్టి ఆయన రూపకల్పన చేస్తారనీ పాఠాలు చెపుతోంది.

హీరోయిన్ ఈత కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చినపుడు హీరోయిన్‌ బికినీతో ఈత కొట్టినట్లు చూపించాలనుకుంటారు కానీ చీరెలోనో లేదంటే చుడీదార్‌లోనో ఈత కొట్టినట్లు చూపించలేరు కదా అని అంటోంది ప్రియమణి. దర్శకులు ఎలా నటించమని చెప్పినా అలా నటించేదుకు తను సిద్ధంగా ఉంటాను అంటోంది. దర్శకుడు గ్లామర్ పండించాలని అనుకున్నప్పుడు దానికి అందరూ సహకరించాలని ప్రియమణి సలహాలిస్తోంది.