శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (17:24 IST)

అనికా హీరోయిన్ అవుతోంది.. ఈమె ఎవరో తెలుసా?

Anikha
అనికా చైల్డ్ స్టార్ నుంచి ప్రస్తుతం హీరోయిన్‌గా మారనుంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అనికా. తెలుగులోనూ ఈ సినిమాలు డబ్బింగ్ అయి మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. 
 
మలయాళంలో మంచి టాక్ తెచ్చుకుని ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన కప్పేల అనే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రస్తుతం సిద్ధమవుతోంది. 
 
నవీన్ చంద్ర విశ్వక్ సేన్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనికా సురేంద్ర టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఇప్పటికే బుల్లితెర నుంచి అవికా గోర్ హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అనికా కూడా చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోయిన్‌గా మారబోతోంది.