శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (11:49 IST)

''సాహో'' టీజర్.. 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 2 మిలియన్ల వ్యూస్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్.. తాజాగా సాహో అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు బాహుబలి సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో అనే క్రేజీ ప్ర

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్.. తాజాగా సాహో అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు బాహుబలి సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 
 
యూవి క్రియేషన్స్ పతాకంపై నిర్మితం కానున్న ఈ చిత్రం 2018లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్‌లు సంగీతాన్ని అందించనున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నాలుగేళ్ళ నుండి ఒకే గెటప్ లో కనిపించిన ప్రభాస్ ని చూసిన ఫ్యాన్స్ కి ఈ మూవీ టీజర్ చాలా రిలాక్స్‌ని ఇచ్చింది. విడుదలైన 24 గంటలలో ఈ మూవీ టీజర్‌కి యూ ట్యూబ్‌లో రెండు మిలియన్ల వ్యూస్ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఖంగుతిన్నాయి.