వెంకయ్యనాయుడు మెచ్చుకున్న సినిమా
రాజకీయాల్లో వుంటూ సినిమాలు చూడడం చాలా కష్టం. అస్సలు టైం కుదరదు అంటూ గతంలో చాలా సార్లు స్టేట్‌మెంట్ ఇచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు. ఎప్పుడు ప్రసంగించినా బ్లాక్‌వైట్‌లోని సినిమాలు, కథలు, హీరోల పాత్రలు, దర్శకుల గురించి ప్రశంసలు, మన సంప్రాదాయలు వెల్లడించే ఆయన ఈరోజు సీతారామం గురించి సోషల్ మీడియాలో తెలియజేశారు.
చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని "సీతారామం" అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు అని తెలిపారు.
ఇంతకుముందు కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసి ఆయన మెచ్చుకుంటూ.. అప్పటి రాజకీయాలు, పండిట్‌ల ఊచకోతలను వెల్లడించారు.