ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-08-2022 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి..

Weekly Astrology
మేషం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలబడతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత, పర్యవేక్షణ ఎంతో అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం :- ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల కుటుంబంలో కలతలు తలెత్తుతాయి.
 
మిథునం :- ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. పెద్దల ఆరోగ్యముగురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
కర్కాటకం :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. ఏదైనా అమ్మకం చేయాలనేమీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. ప్రేమికులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
 
సింహం :- స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ఉద్యోగస్తుల స్థానమార్పిడి యత్నానికి కొంతమంది అడ్డుతగిలే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
కన్య :- దైవ దర్శనాలలో కొంత ఆలస్యమవుతుంది. విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందు లెదుర్కుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పదు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తారు.
 
తుల :- రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనిచేసే చోట అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. వైద్య రంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- నిరుద్యోగులు, వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం.
 
ధనస్సు :- వాయిదాపడినపనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ప్రముఖుల పరిచయాలు, పాతమిత్రుల కలయిక మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలుచేస్తారు. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మకరం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారలతో చికాకలను ఎదుర్కొంటారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ముఖ్యలతో సంభాషించునపుడు మెళుకువ అవసరం.
 
కుంభం :- స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి పని వారితో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారముంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. దైవ, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాతావరణంలోని మార్పు రైతులకు కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచిమంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది.