కమిట్ మెంట్ వల్ల లైఫ్‌లో వచ్చే సమస్యలు ఏమిటి?
Tejaswi Madiwada, Anveshi Jain
"టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ "కమిట్ మెంట్". రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీ నటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19 న థియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో
నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.."కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు.కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కొరకు ఎంతదురం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కొరకు వెళ్ళినపుడు సొసైటీ లో మీ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది.ఆగష్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు అన్నారు.
చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ..ఇది నా మొదటి సినిమా..సొసైటీ కి మంచి సినిమా చూయించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము.ఈ సినిమా పోస్టర్స్ చూసి, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ వున్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆడవాళ్లు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ప్రస్తుత సొసైటీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క లేడీస్ కు కచ్చితంగా నచ్చుతుంది.అలాగే ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ మెచ్చుకొని బ్లెస్స్ చేస్తారని ఆశిస్తున్నాను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ద్వారాకేష్ మాట్లాడుతూ. కోవిడ్ వలన నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సినిమా ను చెప్పగానే ఒప్పుకిని చేసిన నిర్మాతలు బలదేవ్, నీలిమ, అనిల్ గార్లకు ధన్యవాదములు. వీరంతా ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డారు..మంచి మెసేజ్ ఉన్న లక్ష్మి కాంత్ చెన్న రాసుకున్న నాలుగు కథలు స్టోరీ కి వీరంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా తీశారు. ఇందులో ఉన్న నాలుగు కథలు సొసైటీ లో జరిగేవే. ఈ కథలను తెరపై తెస్తున్న ఈ సినిమా సొసైటీ కు బాగా యూజ్ ఫుల్ అవుతుంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా ఈ టీంను మెచ్చుకుంటారు.ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
నటుడు కెవ్వు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సొసైటీ లో జరుగుతున్న రియల్ లైఫ్ లో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని మీరు థియేటర్స్ కు వెళ్తే మీ కళ్ళముందు కనబడుతుంది. ట్రైలర్ చూసి ఇది మంచి మాస్ మసాలా సినిమా అనుకుంటారు. కానీ ఇందులో ఆడవాళ్లు పేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ ను దర్శకుడు శ్రీకాంత్ చెన్న గారు మంచి మెసేజ్ రూపంలో చాలా డిఫరెంట్ వే లో సొసైటీ కు ప్రెజెంట్ చేయడం జరిగింది.ఈ సినిమాను మంచి కమిట్ మెంట్ తో నిర్మాతలు చాలా కస్టపడి అద్భుతమైన సినిమా తీశారు.ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. ఇందులో నేను మంచి పాత్రలో నటించాను. ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అన్నారు.
హీరోయిన్ తనిష్క్ రాజన్ మాట్లాడుతూ.. కమిట్ మెంట్ వంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమాను దర్శక, నిర్మాతలు చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు నా క్యారెక్టర్స్ కు చాలా మంది రిలేట్ అవుతారు. ప్రతి ఒక్క గర్ల్ కు ఉమెన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఉమెన్ చూడవలసిన చిత్రమిది అన్నారు.