బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (16:51 IST)

విజయ్ దేవరకొండ లాంటి ఫ్రెండ్ ఎప్పటికి ఉండిపోతారు : సమంత

Vijay Deverakonda and Samantha at turky
Vijay Deverakonda and Samantha at turky
విజయ్ దేవరకొండ ను సమంత రూత్ ప్రభు తెగ పొగిడేస్తోంది. ఇద్దరు జంటగా  ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. ఆమధ్య కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత తనకు హెల్త్ బాగాలేక రెస్ట్ తీసుకుంది.  ఆమె కోలుకుని షూటింగ్ కు రావాలని విజయ్ దేవరకొండ కోరుకొంటూ ట్వీట్ చేసాడు. ఇక ఇప్పడు సమంత  కోలుకుంది. తాగాజా టర్కీ లో షూట్లో పాల్గొంది. దానికి సంబంధించి రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్న ఫోటో సమంత పోస్ట్ చేసింది.
 
దానితో పాటు, తన బెస్ట్, వరస్ట్, హై, లోస్ చూశానని తన వంటి ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉండిపోతారని విజయ్ ని ఉద్దేశించి పిక్ తో పాటు సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది.  శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే అందరినీ ఆకట్టుకుని మంచి స్పందన రాబట్టింది.