గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 జూన్ 2016 (16:34 IST)

యధార్థ కథతో హార్రర్ మూవీ.. దెయ్యంగా బేబీ సుహాసిని.. 13 ఏళ్ల అమ్మాయి.. కాలిన గాయాలతో?!

దక్షిణాదిన ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హార్రర్ సినిమాల కోసం ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సైతం ఎగబడుతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కన్నడంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అది కన్నడంతో ప

దక్షిణాదిన ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హార్రర్ సినిమాల కోసం ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సైతం ఎగబడుతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కన్నడంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అది కన్నడంతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదల కానుంది. హార్రర్ మూవీలను కల్పిత కథలతో తెరకెక్కించి చూసివుంటాం. కానీ ఈ కన్నడ మూవీ మాత్రం యధార్థ కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. 
 
గుజరాత్‌లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆ అమ్మాయి ఫ్యామిలీ 22 గదులున్న పెద్ద బంగ్లాలో నివసించేవారు. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఆ అమ్మాయి దయ్యమై తిరుగుతోందని చుట్టుపక్కల వారు నమ్ముతారు. ఈ కథను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఆ కుటుంబం అనుమతిని కన్నడ డైరెక్టర్ సుమంత్ కె గొల్లహల్లి తీసుకున్నారు.13 ఏళ్ల అమ్మాయిగా బేబీ సుహాసిని నటిస్తుండగా... మరో ముఖ్యపాత్రలో సుహాసిని మణిరత్నం నటిస్తున్నారు. అంతేగాకుండా జై జగదీష్, ప్రియాంక రావు తదితరులు నటిస్తున్నారు.