శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (17:45 IST)

జీఎస్టీ అశ్లీలం కాదు... ఆధ్యాత్మిక ఆరాధన : రాంగోపాల్ వర్మ

గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) అంటే అశ్లీలం కాదనీ, ఓ ఆధ్యాత్మిక చింతన, ఆరాధన అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయనకు ఓ బాలిక, మహిళ ట్వీట్ చేసినట్టు వెల్లడించారు.

గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) అంటే అశ్లీలం కాదనీ, ఓ ఆధ్యాత్మిక చింతన, ఆరాధన అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయనకు ఓ బాలిక, మహిళ ట్వీట్ చేసినట్టు వెల్లడించారు. 
 
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) శనివారం ఉదయం 9 గంటలకు విడుదలైంది. ఆ తర్వాత జీఎస్టీని చూసిన ఓ యువతి ఈ విధంగా స్పందించిందంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. జీఎస్టీలోని ప్రతి సన్నివేశం వణుకు పుట్టించింది. ఇది అశ్లీలం కాదు. ఫిలాసఫీ అంతకన్నా కాదు. 
 
ఒక మహిళ శరరీంలోని ప్రతీ అంగుళాన్ని ఆధ్యాత్మికంగా ఆరాధించే, పవిత్రంగా పూజించే ప్రక్రియనే శృంగారంగా జీఎస్టీలో చూపించారు. జీఎస్టీ చూసిన తర్వాత.. మమ్మల్ని మహిళలుగా మార్చుతున్నందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలనిపించింది. నా సెక్సువల్ రైట్స్ గురించి ఆలోచింపజేసేలా ఉంది. మియా మాల్కోవా, ఆర్జీవీకి కృతజ్ఞతలు చెబుతున్నానని సదరు యువతి మేసేజ్ పంపినట్లు ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.