వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్
Abhinaya
వీరి వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వాహం జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ఈనెల 20వ తేదీ హైదరాబాదులోనే గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరగబోతుంది.
ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభినయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. రవితేజ హీరోగా వచ్చిన నేనింతే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అభినయ అనంతరం కింగ్, సంగమం, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్ తదితర చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వారికి చెల్లెలు పాత్రలో నటించి అభినయ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు
