సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (07:03 IST)

హరి హర వీరమల్లు గురించి ఏ.ఎం. రత్నం బహిరంగ లేఖ

pawan, a.m. rathnam and others
pawan, a.m. rathnam and others
;పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా హరి హర వీరమల్లు గురించి బయట పెద్ద చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మరి హరి హర వీరమల్లు గురించి అప్డేట్ లేదు. షూటింగ్ జరుగుతుందా, లేదా, అనే అనుమానం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరగడంతో నిర్మాత ఏ.ఎం. రత్నం బహిరంగ లేఖ రాశారు. ఈ సినిమాలో నోరా ఫతేహి, నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజిత పొన్నాడ, సోనాక్షి సిన్హా, మీనాక్షి తదితరులు నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్యం వహిస్తున్నారు. 
 
చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో  పాల్గొంటున్నారు. 'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం.
 
- మెగా సూర్య ప్రొడక్షన్