ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 24 నవంబరు 2022 (23:27 IST)

సజ్జలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Pearl Millet
సజ్జలు చలిలో అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి, ఇవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
చలికాలంలో సజ్జలు తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గత వేడిని కాపాడుకోవడంలో మేలు జరుగుతుంది.
 
సజ్జల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది. సజ్జలు శరీరాన్ని దృఢంగా చేస్తాయి.
 
శీతాకాలంలో వచ్చే కీళ్ల సమస్యలు, బోలు ఎముకల వ్యాధిని ఇవి అడ్డుకుంటాయి.
 
శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది, కానీ ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ సజ్జల్లో ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది.
 
సజ్జలు తినడం వల్ల బరువు పెరగరు.
 
ఇవి జీర్ణక్రియకు ఉపయోగపడే డైటరీ ఫైబర్‌లను పుష్కలంగా కలిగి ఉంటాయి.
 
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయకారిగా పనిచేస్తుంది.
 
సజ్జలు తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది.
 
చిట్కాలను ఆచరించే ముందు వైద్యుని సలహా తీసుకోండి.