శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 24 నవంబరు 2022 (18:11 IST)

చిలకడ దుంప ఎవరు తినకూడదో తెలుసా?

sweet potato
సూపర్‌ఫుడ్ స్వీట్ పొటాటో- చిలకడ దుంప తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి, దానిని తినడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు.
 
స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది.
 
చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు.
 
స్కిన్ ఎలర్జీ ఉంటే, ఖచ్చితంగా దీనిని తినకూడదు.
 
జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది.
 
మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.
 
చిలకడ దుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుంది.