మంగళవారం, 12 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (20:21 IST)

బరువు తగ్గాలంటే.. అవిసె గింజలు.. మిరియాలు, పసుపు..?

Obesity
బరువు తగ్గాలంటే.. అవిసె గింజలు రోజూ చెంచా పాటు తీసుకుంటూ వస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ చెంచా అవిసె గింజల్ని పచ్చళ్లూ, టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ దేనిలోనైనా సరే కలుపుకుని తాగితే మంచిది. సలాడ్లపైనా అరచెంచా అవిసె గింజల నూనె చల్లుకుంటే మంచిది. అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భిణులు మాత్రం వీటికి దూరంగా వుండటం మంచిది. 
 
ఇంకా గ్రీన్ టీ శరీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో అధికం. అంతేగాకుండా శరీర మెటబాలిజాన్ని ఉత్తేజం చేస్తూ, కెలోరీలను కరిగించే పోషకాలను గ్రీన్ టీ కలిగి వుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్థాల్లో మిరియాలు ఒకటి. ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు చేరకుండా సాయపడుతుంది. 
 
సలాడ్లు, కూరల్లో చిటికెడు చల్లుకుని తింటే రుచిగా వుంటుంది. పసుపు యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి వుండటమే కాకుండా దీనికి శరీర మెటబాలిజమ్ రేటు మెరుగుపరిచే శక్తి కూడా కలిగి మెటబాలిజమ్ రేటును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.