గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (15:21 IST)

రాత్రి నిద్రపట్టక పోతే..? ఇవన్నీ మానేయండి..

sleep
మనిషికి నిద్ర చాలా అవసరం. మనిషి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని వైద్యులు చెప్తుంటారు. ఒకవేళ రాత్రి బాగా నిద్ర పట్టక ఇబ్బంది పడే వారు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే నిద్ర వస్తుంది.
 
సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాఫీ, టీ వంటి పానీయాలు తీసుకోకుండా ఉంటే రాత్రి నిద్ర బాగా పడుతుంది. కాఫీ, టీ నిద్రను ప్రేరేపిస్తాయి. కాబట్టి పడుకునే ఆరు గంటల ముందు కాఫీ టీ తాగకపోవడం మంచిది. 
 
జీర్ణ సమస్యలు ఉన్నవారు నిద్రపోయే ముందు భారీగా తినడం మానేయాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తినకూడదు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, రాత్రి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది
 
రాత్రిపూట ఎక్కువ కూరగాయలు ఆహారంలో జోడించండి. రాత్రిపూట మాంసాహారానికి దూరంగా ఉండటం కూడా మంచిది. పడుకునే ముందు స్పైసీ ఫుడ్ తినకూడదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అర్ధరాత్రి బర్గర్ పిజ్జా ఐస్ క్రీం వంటివి తీసుకోకూడదు. 
 
అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆకలిగా అనిపిస్తే పాలలో కాస్త తేనె కలుపుకుని తినవచ్చు. మంచి నిద్ర కోసం పడక గదిని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం. పడక గదిలోని వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.