శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (13:23 IST)

శుక్లపక్షం పంచమి తిథిలో వారాహి పూజ.. సాయంత్రం ఎర్రని వత్తులతో..?

Varahi
Varahi
వారాహిని ఆరాధించడానికి పంచమి తిథి అత్యంత ముఖ్యమైన రోజు. దుష్టశక్తులను నాశనం చేయడంలో అత్యంత శక్తివంతమైన ఈ దేవి సప్తమాతలలో వారాహి దేవి ఒకరు. ప్రతి శుక్లపక్ష పంచమి తిథి నాడు పూర్ణహృదయంతో వారాహి దేవిని ఆరాధించండి. ఇంట్లో దీపం వెలిగించండి. దేవి నామాలను జపించడం ద్వారా ప్రార్థనలు చేయవచ్చు.
 
ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే తెల్ల శెనగ పప్పును మరిగించి అందులో తేనె, నెయ్యి వేసి కలిపి వారాహికి సమర్పించి పూజలు చేయాలి. ఇలా చేస్తే.. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. 
 
వారాహి దేవికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మిరియాలు, జీలకర్ర కలిపిన దోసె, కుంకుమపువ్వు, పంచదార కలిపిన పాలు, యాలకులు, లవంగాలు, పచ్చి కర్పూరం, నల్ల నువ్వులు, చిలగడదుంపలను నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. 
 
సాయంత్రం పూట ఎరుపు వత్తులతో దీపం వెలిగించాలి. పాలను నైవేద్యంగా సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.