కీళ్ళనొప్పులను నయం చేసే మెంతికూర..
మెంతికూర మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పులను దూరం చేస్తుంది. కొందరికి నెలసరికి ముందూ, తర్వాత కడుపు నొప్పి, ఇతరత్రా అసౌకర్యాలూ ఎక్కువగా వుంటాయి. అలాంటి వారు వారంలో వారంలో మూడునాలుగు సార్లు మెంతి కూర తీసుకుంటే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి.
మెంతి ఆకుల్లో ఇనుము, అధికంగా వుంటుంది. గర్భిణీలు ఎంత తీసుకుంటే అంత మంచిది. శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. బాలింతలు మెంతి కూర తినడం వల్ల పాల వృద్ధి బాగుంటుంది.
మెనోపాజ్ సమయంలోను మెంతి కూర తినొచ్చు. ఒత్తిడినీ దూరం చేస్తాయి. నీరసం వంటి వాటిని పోగొట్ట తక్షణ శక్తినందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెంతికూర విటమిన్ సి సమృద్ధిగా లభించే టొమాటోలతో కలిపి వండితే శరీరం వాటి నుంచి అందే పోషకాలను చాలా త్వరగా గ్రహిస్తుంది.
ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి. కీళ్ళనొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.