గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (10:54 IST)

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాదు. శనివారం ఈ సంఖ్య 15,940గా నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల మేరకు కొత్తగా 11,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు చేరుకుంది. 
 
ఇందులో 4,27,72,398 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరో 92576 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 25 మంది చనిపోగా, 10917 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.