ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (11:50 IST)

దీపావళిని సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం..?

దీపావళి పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వున్న ప్రతికూల శక్తులను బయటకు పంపాలి. సానుకూల శక్తిని ఇంటికి ఆహ్వానించి ఆపై ఈ పండుగను జరుపుకోవాలి. దీపావళి రోజున లక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. అలాగే వినాయక స్వామిని లక్ష్మీ కుబేరులతో పూజిస్తారు. 
 
దీపావళి పండుగ అంటేనే సరదా పండుగ. కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. బాణాసంచా ప్రకాశాలతో, దీపాల వెలుగులతోఅందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం లక్ష్మీపూజ మరియు గణేశ పూజ నిర్వహించుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం దీపావళి తర్వాత రోజైన అక్టోబరు 25న వస్తోంది. అయితే సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజే ఏర్పడుతుంది. అందుకే ఈ నెల 25న ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణమే అంటున్నారు. అక్టోబర్ 25 సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 5.42 గంటలకు ముగియనుంది. అంటే దాదాపు 1.15 నిమిషాల పాటు ఉంటుంది.