గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (10:07 IST)

భరత్‌కు శునకాలంటే ఇష్టం.. వీడియో వైరల్..

సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్ (50) ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద గత శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన

సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్ (50) ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద గత శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో చనిపోయిన భరత్‌.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. 
 
భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నారు. అయితే భరత్ రాజు మృతి చెందిన అనంతరం ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భరత్‌ అంత్యక్రియలకు రవితేజతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరు కాని సంగతి తెలిసిందే. 
 
తాజాగా, భరత్‌కు శునకాలంటే ఇష్టమని, ఆయన నివాసంలో పెంపుడు శునకాలు ఉన్నట్టు తెలియజెప్పే వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్లలతో భరత్ ఉండటం కనపడుతుంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయం తెలియదు. సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.