1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 12 మే 2016 (11:06 IST)

నటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూత

ప్రముఖ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి (70) బుధవారం అర్థరాత్రి తనువుచాలించారు. గిరిబాబు, శ్రీదేవిలకు ముగ్గురు సంతానం కాగా ఇందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా శ్రీదేవి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
శ్రీదేవి కన్నుమూయడంతో ఆ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో శ్రీదేవి భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు జరుగునున్నాయి. గిరిబాబు భార్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.