గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2017 (20:51 IST)

'గౌతమ్‌ నంద'గా గోపీచంద్‌...

గోపీచంద్‌ను 'గౌతమ్‌ నంద'గా దర్శకుడు సంపత్‌ నంది చూపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శనివారం నాడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ కథకు ఈ టైటిల్‌ కరెక్ట్‌గానూ పవర్‌ఫుల్‌గా వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు.

గోపీచంద్‌ను 'గౌతమ్‌ నంద'గా దర్శకుడు సంపత్‌ నంది చూపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శనివారం నాడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ కథకు ఈ టైటిల్‌ కరెక్ట్‌గానూ పవర్‌ఫుల్‌గా వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు. గోపీచంద్‌ కెరీర్‌లో పెద్ద చిత్రంగా నిలుస్తుందని అంటున్నాడు. బాలాజీ సిని క్రియేషన్స్‌ బేనర్‌పై జె.భగవాన్‌, పుల్లారావు నిర్మిస్తున్నారు.
 
చిత్రం గురించి వారు చెబుతూ.. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌తో రూపొందుతోంది. దర్శకుడు గోపీ క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రస్తుత షెడ్యూల్‌ ఈ నెల 24 వరకు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అనంతరం పాటను విదేశాల్లో చిత్రిస్తాం. మార్చిలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హాన్సిక, కాథరిన్‌, నిఖితన్‌ ధీర్‌, భరని, ముఖేస్‌ రుషి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్యరాజన్‌.