బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (13:52 IST)

భాయ్ డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్‌కి హీరో దొరికాడా..?

అహ నా పెళ్లంట సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి చిత్రంతోనే విజ‌యం సాధించిన యువ ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్. ఆ త‌ర్వాత సునీల్‌తో పూల‌రంగ‌డు సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న వీర‌భ‌ద్ర‌మ్ ఆ త‌ర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో తెర‌కెక్కించిన భాయ్ సినిమాతో మాత్రం స‌క్స‌స్ సాధించ‌లేక‌పోయాడు. 
 
ఆది సాయికుమార్‌తో తెర‌కెక్కించిన చుట్టాల‌బ్బాయి కూడా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో కెరీర్లో వెన‌క‌బ‌డిన వీర‌భ‌ద్ర‌మ్‌కి ఎట్టకేల‌కు హీరో దొరికాడు అని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... యాంగ్రీస్టార్ రాజ‌శేఖ‌ర్‌తో వీర‌భ‌ద్ర‌మ్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు అని తెలిసింది. అయితే... ఈ డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో ఏ త‌రహా సినిమా చేయ‌నున్నాడు అనేది తెలియాల్సి వుంది.