బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:54 IST)

పూరి బ‌ర్త్ డేకి రామ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం... బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించ‌డం తెలిసిందే. త‌న కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్ట‌ర్ పూరి అంటే హీరో రామ్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింది.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న పుట్టిన‌రోజున రామ్ ప్ర‌త్యేక‌మైన విషెష్ చెప్ప‌డంతో పాటు ఆయ‌న‌కొక థ్రిల్లింగ్ గిఫ్ట్‌ను పంపాడు. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే... గోల్డ్ ఫాంట‌మ్ స్పీక‌ర్‌. వైర్‌లెస్ బెస్ట్ స్పీక‌ర్‌. దీని విలువ మూడు ల‌క్షలు పైగానే ఉంది. 
 
ఈ స్పీక‌ర్‌ను బ‌హుమ‌తిగా అందుకున్న పూరి జ‌గ‌న్నాథ్ `ల‌వ్ యు రామ్` అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను వింటూ పూరి ఎంజాయ్ చేసే వీడియో తీసిన చార్మి దాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.