శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:27 IST)

సైరా గురించి.. చిరు గురించి పూరి రియాక్ష‌న్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమా రిలీజ్‌కి అంతా రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని మిస్ అయిన పూరి ఈ సినిమా గురించి, చిరంజీవి గురించి చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియో చూస్తే పూరికి చిరు అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది.
 
ఇంత‌కీ పూరి ఏం చెప్పాడంటే... కొన్నాళ్ల క్రితం చరణ్ నాతో ఒక మాట చెప్పాడు. డాడ్‌తో ఒక మెమరబుల్ సినిమా తియ్యాలి. మనందరం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే సినిమా అవ్వాలి అని.. మొన్న సైరా ట్రైలర్ చూడగానే నాకు చరణ్ గుర్తుకొచ్చాడు. 
 
నిజంగా అలాంటి సినిమా తీసాడు. గ్రాండియర్ గానీ, విజువల్స్ గానీ.. సూప‌ర్ అంటూ సైరా సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెబుతూ సురేందర్ రెడ్డి అయితే ఇరగ్గొట్టేసాడు అని చెప్పాడు.