శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (21:47 IST)

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్న గోపీచంద్... ఇంత‌కీ ఎవ‌రా ఫ్లాప్ డైరెక్ట‌ర్..?

హీరో గోపీచంద్... గ‌త కొంతకాలంగా స‌రైన స‌క్స‌స్ లేక స‌త‌మ‌త‌మౌతున్నాడు. దీంతో క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం చాణ‌క్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. చాణ‌క్య సినిమా త‌ర్వాత ప్రాజెక్టు ద్వారా సుబ్రహ్మణ్యం అనే ఒక నూతన దర్శకుడిని గోపీచంద్ పరిచయం చేస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. 
 
ఈ సినిమాలో కథానాయికగా కాజల్ పేరు వినిపిస్తోంది. ఇదిలావుంటే... క‌థ‌ల విష‌యంలో ప్ర‌స్తుతం ఎంతో కేర్ తీసుకుంటున్న గోపీచంద్ ఫ్లాప్ డైరెక్ట‌ర్ సంప‌త్ నందికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గ‌తంలో సంప‌త్‌నందితో గౌత‌మ్ నంద‌ అనే సినిమా చేసారు. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌ళ్లీ సంప‌త్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్ప‌డం విశేషం. 
 
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. గౌతమ్ నంద తరువాత గోపీచంద్ - సంపత్ నంది కలిసి చేస్తోన్న సినిమా ఇది. గోపీచంద్‌కి ఇది 28వ సినిమా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. మ‌రి.. గోపీచంద్, సంప‌త్ నంది ఈసారైనా విజ‌యం సాధిస్తారేమో చూడాలి.