మంగళవారం, 4 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (23:42 IST)

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

robo shankar
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 46. విజయ్ టీవీలో ప్రసారమైన 'కలక్కపోవదు యార్' అనే షో ద్వారా రోబో శంకర్ ప్రసిద్ధి చెందారు. తన అద్భుతమైన మిమిక్రీ నైపుణ్యంతో టెలివిజన్ ప్రేక్షకులలో ఆదరణ పొందారు. చుట్టి అరవింద్‌తో కలిసి ఆయన ప్రదర్శించిన కామెడీలు ఎంతగానో ప్రజాదరణకు నోచుకున్నాయి. వేదికపై రోబో లాంటి నృత్యం చేయడం వల్ల ఆయన పేరు రోబో శంకర్‌గా స్థిరపడిపోయింది. 
 
వివిధ స్టేజ్ షోలలో స్టాండ్-అప్ కామెడీ, మిమిక్రీ చేస్తూనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా నటించారు. విజయ్ సేతుపతి నటించిన 'ఇదర్కుదానే ఆసైపట్టాయ్ బాలకుమార' అనే చిత్రంలో ఆయనకు పూర్తి నిడివి గల పాత్ర లభించింది. తర్వాత ఆయన 'కప్పల్', 'మారి', 'వాయై మూడి పెసవుమ్' వంటి అనేక చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. విష్ణు విశాల్ చిత్రం 'వేలైన్ను వందుట్టా వేలైకారన్'లో ఆయన కామెడీకి మంచి ఆదరణ లభించింది.
 
కొన్ని సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాధి కారణంగా రోబో శంకర్ చాలా బరువు తగ్గాడు. తర్వాత అతను నెమ్మదిగా కోలుకున్నారు. సినిమాలు, టీవీ షోలలో మళ్ళీ కనిపించారు. ఈ పరిస్థితిలో ఆయన మళ్లీ అనారోగ్యం పాలుకావడంతో చెన్నైలోని పెరుంగుడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతను తీవ్రమైన చికిత్స పొందుతున్నాడు. ఈ పరిస్థితిలో, చికిత్స నుండి ఎటువంటి ప్రభావం లేకుండా రోబో శంకర్ సెప్టెంబరు 18వ తేదీన మరణించాడు. అతని మరణం పట్ల చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.