చైతు, అఖిల్‌తో చేసే అవకాశం కలిగింది : హీరో సుశాంత్
యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఏ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్
యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఏ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆటాడుకుందాం.. రా' (జస్ట్ చిల్). ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్‌తో ఇంటర్వ్యూ....
హీరో సుశాంత్ మాట్లాడుతూ శ్రీధర్ సీపాన కథ చెప్పగానే విపరీతంగా నవ్వాను. ఎంతలా అంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశాను. 2 గంటలు పాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే చిత్రమిది. మూవీ చాలా వేగంగా ఉంటుంది. గ్యారెంటీగా అందరూ ఎంజాయ్ చేసే చిత్రంగా నిలుస్తుంది. నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని వంటి సీనియర్ యాక్టర్స్‌తో ఎంటర్‌టైనింగ్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. అనూప్, అడ్డా కంటే మంచి మ్యూజిక్ ఇస్తానని చెప్పడమే కాకుండా అలాంటి ఎక్సలెంట్ మ్యూజిక్‌నందించాడు.
సినిమాలో ఎంటర్‌టైనింగ్‌తో పాటు మంచి టచింగ్ సన్నివేశాలుంటాయి. అమ్మ, శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే చైతన్య రోల్ అనుకున్నాం. అయితే సినిమా బాగా వస్తేనే ఈ రోల్ చేయమని తనను అడగాలని అనుకున్నాను. సినిమా బాగా వస్తుందనిపించడంతో చైతన్యను రోల్ చేయమన్నాను. నేను చేస్తే నీకు బావుంటుందంటే చేస్తానని చెప్పి చైతు రోల్ చేయడానికి అంగీకరించాడు.
అఖిల్‌నైతే నేను అడగలేదు. మా సిస్టర్‌తో తను ఈ సినిమాలో చేయడానికి రెఢీయే అని తెలిసి తనకు కాల్ చేసి నీ రెండో సినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ చిత్రంలోగెస్ట్ రోల్ చేస్తావా అని అడిగాను. తప్పకుండా చేస్తానని చెప్పడంతో నేను హ్యాపీగా ఫీలయ్యాను. అఖిల్‌తో చేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. 'మనం' సినిమాలో చేయలేకపోయాను. కానీ ఈ చిత్రంలో చైతు, అఖిల్‌తో చేసే అవకాశం కలిగింది. వ్యక్తిగతంగా చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నారై కుర్రాడి పాత్రలో కనపడతాను. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఉన్నా ఎక్కడా భారీ డైలాగ్స్ ఉండవు. ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అందులో ఒకటి టైం మిషన్ సెట్ ఒకటి. రేపు సినిమాలో ఆడియెన్స్‌కు థ్రిల్ అవుతారు.
మొత్తం మీద ఫన్ మూవీ. చాలా స్టైలిష్‌గా నటించాను. రీమిక్స్ చేయడమంటే టెన్షన్. ఈ సినిమాలో కూడా 'పల్లెకు పోదాం.. పారును చూద్దాం' అనే సాంగ్‌లో ఓ బిట్‌ను మాత్రమే ఉపయోగించాం. పూర్తి పాటను రీమిక్స్ చేయలేదు. ఈ పాటలో వేసిన పంచెకట్టు గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశ్వర్ రెడ్డి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన అందరి దగ్గర నుండి మంచి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నారు. కొత్త సుశాంత్‌ను తెరపై చూస్తారు. నా నెక్ట్స్ మూవీ బయట బ్యానర్‌లో ఉంటుంది. చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నాను అన్నారు.