గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మే 2024 (17:11 IST)

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

Aashi Roy
Aashi Roy
నటి ఆషీరాయ్ బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లింది. పార్టీలో జరిగిన పరిణామాలపై స్పందించింది.  ఓ వీడియో కూడా ఇన్ స్టాలో పోస్టు చేసింది. "నేను బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడ పిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను" అని వివరణ ఇచ్చింది. 
 
వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకునే వెళ్లానని ఆషీరాయ్ అన్నారు. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే ఈ పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామని బెంగళూరు సీపీ తెలిపారు. ఇప్పటివరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్‌ తీసుకున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పట్టుబడినవారిలో చాలామంది హైదరాబాద్ టెకీలు ఉన్నారని చెప్పారు.
 
కాగా, ఆషీ రాయ్.. వైతరణి రాణా, లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక, కెఎస్ 100 వంటి చిత్రాల్లో నటించింది.