గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (16:57 IST)

హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ సెట్లో శంకర్ పుట్టినరోజు వేడుకలు

charan, sankar, dil raju
charan, sankar, dil raju
హైదరాబాద్‌లోని బేగంపేటలో సెట్స్‌లో ఉండగానే గేమ్ ఛేంజర్ టీమ్ అంతా కలిసి ఎస్ శంకర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  దర్శకుడి పుట్టినరోజును జరుపుకోవడానికి ఆనందంగా ఉందని  రామ్ చరణ్ అన్నారు.
 
charan, sankar, dil raju
charan, sankar, dil raju
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ శంకర్ నేడు తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. పాన్-ఇండియా అనేది ఈనాటిలా పెద్దగా ఉపయోగించని పదం కానప్పుడు పాన్-ఇండియా విజయాన్ని సాధించిన తమిళ సినిమాలో ఆల్-టైమ్ క్లాసిక్‌లలో కొన్నింటిని దర్శకుడు శంకర్ రూపొందించారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే నిర్మాత దిల్ రాజులు శంకర్ చేత కేక్ కట్ చేయించి తనకి బర్త్ డే విషెస్ తెలియజేసి సెలబ్రేట్ చేశారు. దీనితో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 
ఈ చిత్రంతో పాటుగా శంకర్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో కూడా “ఇండియన్ 2” అనే చిత్రం కూడా చేస్తున్నారు.