శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 10 డిశెంబరు 2018 (12:23 IST)

టాప్ హీరోయిన్ కాగానే పెళ్లి చేస్కుంటానన్న నటి... ఇచ్చిన మాట ప్రకారం తిరుపతిలో...

ప్రేమంటే ఇదేరా అని మన తెలుగులో ఓ చిత్రం వచ్చింది. నిజంగా అలాంటి ప్రేమే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఓ టాప్ హీరోయిన్‌ స్థానంలో వున్న నటి తను తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్న వ్యక్తిని ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోబోతోంది. అది కూడా తిరుమల తిరుపతిలో. ఇంతకీ ఎవరా నటి?
 
సిద్దూ ప్లస్ టూ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ చాందినీ. ఈమె తొలుత చిన్నచిన్న చిత్రాల్లో నటించినా మెల్లిగా టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేకమైన స్థానం వుంది. ఆమె చేతిలో మూడు చిత్రాలు వున్నాయి. ఇలా అగ్ర స్థానానికి చేరుకున్న ఆమె తను తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్న డ్యాన్స్ డైరెక్టర్ నందను వివాహం చేసుకోబోతోంది. 
 
తమ వివాహం తిరుమలలో జరుగుతున్నట్లు చెప్పింది. ప్రేమించుకునే సమయంలోనే తన ప్రియుడికి తను టాప్ హీరోయిన్ స్థాయిని అందుకున్న తర్వాత పెళ్లాడుతానని మాట ఇచ్చిందట. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పెళ్లాడబోతోంది.