సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 8 డిశెంబరు 2018 (17:13 IST)

పెళ్ళి తరువాత చేయాల్సింది ఇప్పుడే చేసేస్తున్నాగా... రకుల్

తెలుగు సినీపరిశ్రమలో ఖాళీ లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మొదట్లో కేవలం పాకెట్ మనీ కోసం అడ్వర్టైజ్‌మెంట్లు చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. అంచెలంచెలుగా అగ్ర హీరోయిన్లలో ఒకరయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. అయితే గత కొన్నినెలలుగా రకుల్ పెళ్ళిపైన సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. 
 
రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతందని కుటుంబ సభ్యులు చూసిన వరుడినే చేసుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అదంతా అబద్ధమని కొట్టి పారేస్తోంది. ఇప్పుడే నేను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన లేదు... కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. నా ముందు ఉన్నది సినిమాలు మాత్రమే. 
 
అయితే పెళ్ళి చేసుకోవడం.. ఆ తరువాత సకుటుంబ సపరివార సమేతంగా కలిసి ఉండటం ఇదంతా షూటింగ్‌లో జరిగిపోతోంది కదా. ఎన్నో సినిమాల్లో పెళ్ళి కూతురుగా చేశాను. అలాగే పెద్ద కుటుంబంలో కలిసి ఉన్నట్లు సినిమాల్లో నటించాను. ఇంకేముంది. పెళ్ళి తరువాత కూడా ఇలాగే ఉంటుంది కదా. లైట్ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే నా పెళ్ళి లేదు అని తెగేసి చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.