శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 10 ఆగస్టు 2017 (14:42 IST)

కాజల్ అగర్వాల్‌ను 60 ఏళ్లు అలా వాడుకోవచ్చు...

టాలీవుడ్ సెక్సీ నటి, నేనే రాజు నేనే మంత్రి హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు గట్టి షాక్ మద్రాసు హైకోర్టు ద్వారా తగిలింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... కాజల్ అగర్వాల్ వివిడి కొబ్బరి నూనె సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించినందుకు కొంత మొత్తాన్ని తీసుకుంది. ఇది జరిగింద

టాలీవుడ్ సెక్సీ నటి, నేనే రాజు నేనే మంత్రి హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు గట్టి షాక్ మద్రాసు హైకోర్టు ద్వారా తగిలింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... కాజల్ అగర్వాల్ వివిడి కొబ్బరి నూనె సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించినందుకు కొంత మొత్తాన్ని తీసుకుంది. ఇది జరిగింది 2008లో. ఐతే అదే ప్రకటనను వివిడి అలా వాడుతూనే వుంది. దీనిపై కాజల్ అగర్వాల్ కోర్టులో కేసు వేసింది. 
 
తను నటించిన ప్రకటనను కేవలం ఏడాది పాటు మాత్రమే వాడుకోవాలనీ, కానీ వివిడి మాత్రం ఏడాది ముగిసినా ఇంకా వాడుకుంటూనే వున్నదని పిటీషన్ వేసింది. ఇలా వాడుకుంటున్నందుకు తనకు రూ.2.5 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని పేర్కొంది. పిటీషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం కాజల్ పిటీషన్‌ను కొట్టివేసింది. 
 
ప్రకటనదారుడికి ఏదేని ప్రకటనను 60 ఏళ్లపాటు వాడుకునే హక్కు వుంటుందనీ, ఈ విషయంలో సంస్థకు సర్వహక్కులు వుంటాయని తెలుపడంతో కాజల్ అగర్వాల్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.