బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (17:58 IST)

బోల్డ్ ఫోటోలతో హల్చల్ చేస్తున్న మంచు లక్ష్మి

manchu lakshmi prasanna
ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న సినీ రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. తండ్రి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తన టాలెంట్‌తో ఆమె రాణిస్తున్నారు. పైగా, ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువే అయినప్పటికీ ఆమెకు క్రేజ్ మాత్రం రాణిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
manchu lakshmi prasanna
 
సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు సమస్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ బ్లౌజ్, శారీలో ఆమె మెరిసిపోతున్నారు. ఈ బోల్డ్ ఫోటోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తు షేర్ చేస్తున్నారు.
manchu lakshmi prasanna