మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (10:40 IST)

అందాల 'నిధి'తో హీటెక్కిస్తున్న 'అగర్వాల్'

బాలీవుడ్ నుంచి తెలుగు వెండితెరకు దిగుమతి అయిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె నటించిన చిత్రాలు వేళ్లపై లెక్కించవచ్చు. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు ఈ అమ్మడుకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మాత్రం సూపర్ డూపర్ హిట్. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు.
 
అయినప్పటికీ ఈ అమ్మడు పేరు మీడియాలో నలుగుతూనే వుంది. దీనికి కారణంగా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటో చూసిన ప్రతి ఒక్కరికీ మతిపోతోంది. నిధి సొగసులు చూసేందుకే అన్నట్లుగా ఆమె ఇచ్చిన ఆ ఫోజు.. చూపరులను చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇంకా డౌట్‌గా ఉంటే.. మీరూ ఓ లుక్కేయండి మరి.