సినీ ఛాన్స్‌లు కావాలంటే హీరోలు బెడ్రూంకు రమ్మన్నారు : మలయాళ నటి పార్వతి
వెండితెర వెనుక సినీ అవకాశాల కోసం వెంపర్లాడే హీరోయిన్లకు జరుగుతున్న వేధింపులపై ఇటీవలి కాలంలో బహిరంగంగా స్పందించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అవకాశాల కోసం వెళ్లిన తమను హీరోలు, దర్శక నిర్మాతలు ఎలాంటి కోర్క
వెండితెర వెనుక సినీ అవకాశాల కోసం వెంపర్లాడే హీరోయిన్లకు జరుగుతున్న వేధింపులపై ఇటీవలి కాలంలో బహిరంగంగా స్పందించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అవకాశాల కోసం వెళ్లిన తమను హీరోలు, దర్శక నిర్మాతలు ఎలాంటి కోర్కెలు కోరారో పలువురు హీరోయిన్లు వెల్లడించారు. ఈ కోవలో ఇపుడు మలయాళ నటి పార్వతి కూడా చేరింది.
తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని, పడకగదికి రమ్మనే చేదు అనుభవాన్ని తానూ ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు పలుమార్లు తనను బెడ్రూంకు రమ్మన్నారని తెలిపింది.
అయితే ఇక్కడ ఇదంతా మామూలేనని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారని కూడా పేర్కొంది. తాను తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఇదేనని, అలాంటి అవకాశాలు తనకు వద్దని తేల్చి చెప్పింది. ఈ కారణంగానే తాను చాలాకాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని చెప్పుకొచ్చింది. ‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన పార్వతి చేసింది తక్కువ సినిమాలే అయినా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.